TS: హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కేశ‌వ‌రావు క‌న్నుమూత‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పి. కేశ‌వ‌రావు (60) క‌న్నుమూశారు. అనారోగ్యంతో ఆయ‌న య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉద‌యం (సోమ‌వారం) తుదిశ్వాస విడిచారు. జ‌స్టిస్‌కేశ‌వ‌రావు మృతితో తెలంగాణ‌లోని కోర్టుల‌కు హైకోర్టు ఇవాళ సెల‌వు ప్ర‌క‌టించింది. జడ్జి మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ మ‌హాప్ర‌స్థానంలో జ‌స్టిస్ కేశ‌వ‌రావు అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.

Leave A Reply

Your email address will not be published.