బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు కరోనా
హైదరాబాద్ (CLiC2NEWS): బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కరోనా బారిన పడ్డారు. ఆయనకు వైరస్ సోకడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు.వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నందున.. తీసుకోవాల్సిన మందులు, ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈనెల 8న నల్లగొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్ బిఎస్పీలో చేరిన విషయం తెలిసిందే.