అంత‌ర్వేదిలో 15 మీట‌ర్ల మేర ముందుకు వ‌చ్చిన స‌ముద్రం

అంత‌ర్వేది (CLiC2NEWS): గ‌త కొన్ని రోజులుగా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటుచేసుకుంటుండ‌టంతో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిన‌ట్టు తాజాగా వాతావార‌ణశాఖ పేర్కొంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్లోని తూ.గో జిల్లా స‌ఖినేటిప‌ల్లి మండ‌లంలోని అంత‌ర్వేదిలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున స‌ముద్రంలో అల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి. అల‌లు పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డ‌టంతో పాటుగా స‌ముద్రం 15 మీట‌ర్ల మేర ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బీచ్ లో ఉన్న దుకాణాలు నేల‌మ‌ట్టం అయ్యాయి. స‌ముద్రం లో మార్పులు చోటుచేసుకుంటుండ‌టంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గుర‌వుతున్నారు. మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లొద్ద‌ని అధికారులు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.