బ్యాంకులకు వరుసగా సెలవులు! ఎప్పుడెప్పుడంటే..?
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి తమ అవసరాలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు. ఆగస్ట్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ఈ 15 రోజుల సెలవులు గెజిటెడ్ సెలవులతోపాటు.. వారాంతాను కూడా కలిగి ఉంటాయి. ఇందులో 8 రాష్ట్రాల వారిగా సెలవులు ఉండగా.. మిగిలిన 7 వారాంతాపు సెలవులు.
ఆర్బీఐ బ్యాంకు సెలవులను 3 వర్గాలుగా విభజించింది.
- నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే,
- రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే,
- బ్యాంకు క్లోజింగ్ హాలీడే ఉంటాయి.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగ సెలవులు వస్తాయి. ఆగస్ట్ నెలలో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారంతో పాటు పండుగల రోజులు సెలవులు ఉంటాయి.
బ్యాంకుల సెలవులు.. పరిశీలిస్తే..
- 13-08-2021 – దేశభక్తుల దినోత్సవం (ఇంఫాల్)
- 14-8-2021 – రెండవ శనివారం
- 15-8-2021 – ఆదివారం
- 16-8-2021 – పార్స్ న్యూ ఇయర్ (షహెన్షాహి) / (బేలాపూర్, ముంబై, నాగపూర్)
- 19-8-2021 – ముహర్రం (అశూర) / (అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్పూర్, రాంచీ, శ్రీనగర్)
- 20-8-2021 – ముహర్రం/మొదటి ఓనం (బెంగళూరు, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం)
- 21-8-2021 – తిరువోనం (తిరువనంతపురం, కొచ్చి)
- 22-8-2021 – ఆదివారం
- 23-8-2021 – శ్రీ నారాయణ గురు జయంతి (తిరువనంతపురం, కొచ్చి)
- 28-8-2021 – నాల్గవ శనివారం
- 29-8-2021 – ఆదివారం
- 30-8-2021 – జన్మాష్టమి (శ్రావణ్ వడ్ -8)/కృష్ణ జయంతి (అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, గ్యాంగ్టాక్)
- 31-8-2021 – శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్)