ముంబ‌యిలో డెల్టా ప్ల‌స్ తొలి మ‌ర‌ణం

ముంబ‌యి (CLiC2NEWS): దేశంలో క‌రోనా వేరియంట్లు ఉనికి చాటుతూనేఉన్నాయి. తాజాగా ముంబ‌యిలో తొలి డెల్టాప్ల‌స్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఓ వృద్ధురాలు (63) జూలై 27న ఈ వేరియంట్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయార‌ని వైద్యాధికారులు వెల్ల‌డించారు.

కాగా ఆ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు ప‌లు ర‌కాల రుగ్మ‌త‌లు ఉన్నాయ‌ని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న త‌ర్వాత ఆ మ‌హిళ‌కు వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబ‌యిలో ఏడు గురికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ సోకిన విష‌యం తెలిసిందే. ఆమె నుంచి సేక‌రించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ రిపోర్ట్ బుధ‌వారం వ‌చ్చిది. ఆమెతో స‌న్నిహ‌త సంబంధం క‌లిగి ఉన్న మ‌రో ఇద్ద‌రికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. అయితే మృతిచెందిన వ్య‌క్తికి మాత్రం ట్రావెల్ హిస్ట‌రీ లేద‌ని అధికారులు చెప్పారు.

డెల్టా ప్ల‌స్ వేరియంట్ వ‌ల్ల మ‌హారాష్ట్ర‌లో తాజాగా న‌మోదైన మ‌ర‌ణంతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మృతిచెందారు. గ‌త నెల‌లో ర‌త్న‌గిర‌కి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆ వేరియంట్‌కు బ‌ల‌య్యారు. ఆమె కూడా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డింద‌ని వైద్యాధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.