తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు అమలు
కరీంనగర్ (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సిఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధుపై ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ కలిసి సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద ప్రతీ లబ్దిదారుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16న జరిగే సభలో 15 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం అని సిఎస్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నామని రాహుల్ బొజ్జా తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని అన్నారు. జాబితాలో వివరాలు లేనివారిని కూడా కొత్తగా నమోదు చేస్తామని తెలిపారు.