AP: జాతీయ జెండాను ఎగురవేసిన సిఎం వైఎస్ జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయజెండాను ఎగురవేశారు. జెండా వందనం అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ స్వాతంత్ర్య దినోత్సవపు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. `కొత్త లక్ష్యాలను నిర్దశించుకునే సమయం ఇది, రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు ప్రజలందరికీ సమానంగా అందాలి` అని ఆయన తెలిపారు.