బ‌లగాల ఉపసంహరణను సమర్థించుకున్న బైడెన్‌

వాషింగ్ట‌న్‌ (CLiC2NEWS): అఫ్ఘానిస్తాన్‌లో త‌లెత్తిన సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణ‌యాలే కార‌ణ‌మ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేపథ్యంలో అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ మొద‌టి సారి నోరు విప్పారు.అఫ్ఘన్‌ నుంచి బలగాల ఉపసంహరణను సమర్థించుకున్నారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 20 సంవత్సరాల తర్వాత ఈ విష‌యాన్ని గ్ర‌హించాన‌ని జో బైడెన్ పేర్కొన్నారు. అయితే అనుకున్న‌దానికంటే వేగంగా అఫ్ఘనిస్తాన్‌ వేగంగా తాలిబాన్ల వశమైందన్నారు. అయితే, తనకు ఎలాంటి విచారం లేదని ఆయన పునరుద్ఘాటించారు. సోమవారం వైట్‌హౌస్ నుంచి చేసిన టెలివిజన్ ప్రసంగంలో బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

అది మా లక్ష్యం కాదు..
అమెరికా ప్ర‌జ‌ల‌పై తాలిబ‌న్లు దాడి చేస్తే తీవ్ర ప‌రిస్థితులు ఉంటాయ‌ని బైడెన్ హెచ్చ‌రించారు. మ‌రో దేశ అంత‌ర్య‌ద్ధంలో అమెరికా పోరాడాల‌ని తాను సైనిక బ‌ల‌గాగాల‌కు చెప్ప‌న‌న్నారు. త‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తార‌ని తెలుస‌న్నారు. అమెరికా చేస్తున్న యుద్ధంలో తాను నాలుగో అధ్య‌క్షుడిన‌ని, అయితే ఈ బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ ప‌నిని ఐదో అక్ష్య‌క్షుడికి బ‌దిలీ చేయ‌ద‌లుచుకోలేద‌న్నారు.

2009/11 ఘటన ఆర్వాత అల్ ఖైదాతో సంబంధాల కోసం తాలిబన్లను శిక్షించే దాని ప్రారంభ లక్ష్యాలకు మించి విస్తరించిన యుద్ధాన్ని ఆపడమే ప్రాధాన్యం అన్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కేంద్రీకృత ప్రజాస్వామ్యం నిర్మించడం తమ లక్ష్యం కాదన్నారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. శాశ్వత సైనిక ఉనికి లేని దేశాల్లో ఉగ్రవాదంపై పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమెరికా దళాలు నిష్క్రమించినప్పటికీ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు. తాలిబాన్లు మళ్లీ దాడులను ప్రారంభిస్తే ‘వినాశకరమైన’ సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

అఫ్గాన్​లోని ప్రస్తుత పరిణామాలు.. విచారకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్ఘన్‌ ప్రజలకు అమెరికా మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రాంతీయ దౌత్యం కోసం ఆఫ్ఘన్‌ హక్కుల కోసం పాటుపడుతుందన్నారు. ప్రస్తుతం అఫ్ఘన్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా నాటో బల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌తో తాలిబ‌న్లు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్ర‌మిస్తూ దేశ రాజ‌ధాని కాబుల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

1 Comment
  1. SEO says

    Wow, amazing blog layout! How long have you ever been blogging for? you made blogging glance easy. The total glance of your web site is fantastic, as well as the content material!!

Leave A Reply

Your email address will not be published.