T20 : వ‌ర‌ల్డ్‌క‌ప్‌ టీమ్‌ను ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా..

సిడ్నీ (CLiC2NEWS): అక్టోబ‌ర్ 17 నుంచి ఒమ‌న్‌, యూఏఈ వేదిక‌గా ప్రారంభం కాబోయే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం గురువారం 15 మంది స‌భ్యుల టీమ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. స్టార్ ప్లేయ‌ర్స్ స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్న‌ర్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్ క‌మిన్స్‌లాంటి వాళ్లు తిరిగి ఆస్ట్రేలియా టీమ్‌లోకి వ‌చ్చారు. కాగా వికెట్ కీప‌ర్, బ్యాట్స్‌మ‌న్ జోష్ ఇంగ్లిస్‌ను టీమ్‌లోకి తీసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోనే రికార్డు స్థాయిలో 5 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లను గెలిచింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కూడా గెల‌వ‌లేక‌పోయింది ఆస్ట్రేలియా.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఆస్ట్రేలియా టీమ్‌

ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), ఆష్ట‌న్ అగార్‌, ప్యాట్ క‌మిన్స్ (వైస్ కెప్టెన్‌), మిచెల్ మార్ష్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కేన్ రిచ‌ర్డ్‌స‌న్‌, స్టీవ్ స్మిత్‌, జోష్ హేజిల్‌వుడ్‌, జోష్ ఇంగ్లిస్‌, మిచెల్ స్టార్క్‌, మార్క‌స్ స్టాయినిస్‌, మిచెల్ స్వెప్స‌న్‌, మాథ్యూ వేడ్‌, ఆడమ్ జంపా. డేవిడ్ వార్న‌ర్‌.

Leave A Reply

Your email address will not be published.