ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/jeep.jpg)
పలాస (CLiC2NEWS): శ్రీకాకుళం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం సున్నాదేవి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ పోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. కాగా కలకత్తాలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రహదారిని క్రాస్ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మృతులు వివరాలు..
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎఆర్ ఎస్సై కె. కృష్ణుడు, వై బాబూరావు, పి. ఆంటోనీ, పి జనార్ధనరావు ఉన్నట్లు గుర్తించారు.
సీఎం జగన్ సంతాపం
ఏఆర్ పోలీసుల దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డీజీపీ గౌతం సవాంగ్.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.