ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి..

మ‌రో 20 ఏళ్లు టిఆర్ఎస్‌దే అధికారం: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని.. దళిత బంధు అమలుపై పార్టీ శ్రేణులందరికీ అవగాహన కల్పించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కెసిఆర్ పార్టీ ప్రతినిధులకు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ముగిసింది.

ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై సిఎం కెసిఆర్‌ చ‌ర్చించారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

సమావేశం ముగిసిన తర్వాత ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. టిఆర్ ఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయాలను ఈ సంద‌ర్భంగా మీడియాకు వెల్లడించారు.

సెప్టెంబర్‌ 2న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఢిల్లీలో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర స‌మితి కార్యాలయం భూమి పూజ నిర్వహించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

32 జిల్లాల్లో పార్టీ జిల్లా కార్యాలయాలను కేసీఆర్‌ అక్టోబర్‌లో ప్రారంభిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభం చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

సెప్టెంబర్‌లోనే జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తెరాస ద్విదశాబ్ది ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.