భవిష్యత్తులో.. బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల బంధు: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందుననే తొలుత దళిత బంధు పథకం తెచ్చామని ముఖ్యమంత్రి కెసిఆర్ ​ వెల్లడించారు. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు కూడా తీసుకొస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్య‌మంత్రి అన్నారు. మరో 20 ఏళ్లు తెరాసనే అధికారంలో ఉంటుందంటూ రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ధీమావ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై సిఎం కెసిఆర్‌ చ‌ర్చించారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

Leave A Reply

Your email address will not be published.