కెసిఆర్ సర్కార్ ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు..
నాదే గెలుపని కెసిఆర్ చేయించుకున్న సర్వేలే చెప్పాయి: ఈటల రాజేందర్

జమ్మికుంట (CLiC2NEWS): ప్రజలపై ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల కోసమే `దళితబంధు` కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ చేపట్టింది అని మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు… ముఖ్యమంత్రికి దళితులపై ప్రేమ లేదని.. వారి ఓట్లపై ప్రేముందని ఈటల విమర్శంచారు. తన రాజీనామా వల్ల హుజూరాబాద్ ప్రజలకు లాభం కలుగుతోందని.. అందరికీ పింఛన్లూ వస్తున్నాయని ఈటల అన్నారు. హుజూరాబాద్ ప్రజలకిచ్చే వరాలు రాష్ట్రమంతా ఇవ్వాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చే దళిత బంధు, పింఛన్లు, రేషన్‌కార్డులు తీసుకుని ఓటు మాత్రం ఈటలకే వేస్తామని హుజూరాబాద్ ప్రజలు అంటున్నారని సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వందలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా టిఆర్ ఎస్ పార్టీ ఓటమి నిర్ణయమైపోయిందన్నారు. తన రాజీనామాతో హుజూరాబాద్ ప్రజలకు లాభం కలిగిందని ఈటల అన్నారు.