సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ బ‌దిలీ..

కొత్త సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌ను తెలంగాణ స‌ర్కార్ బ‌దిలీ చేసింది. ఆయ‌న‌ను ఆర్టీసీ ఎండీగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌జ్జ‌నార్ మూడేళ్ల‌పాటు సైబ‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు.. ఇక సైబ‌రాబాద్‌కు కొత్త సీపీగా స్టీఫెన్ ర‌వీంద్ర‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ ర‌వీంద్ర ప్ర‌స్తుతం వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.