బ్యాంకు ఉద్యోగులకు పెరుగనున్న పెన్షన్
న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేబశీష్ పాండా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందుతారు. దాంతో ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ కాస్తా రూ.30,000-35,000కు పెరుగనున్నది.