మళ్లీ పెరిగిన కరోనా కేసులు..
కొత్తగా 46,759 కరోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): మరోమారు కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం ఉదయంకేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కు చేరింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 46,759 మంది బాధితులు కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,18,51,802 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 509 మంది మరణించారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,37,370 మంది మహమ్మారికి బలయ్యారు.
- ప్రస్తుతం దేశంలో 3,59,775 కేసులు యాక్టివ్గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
- గత 24 గంటల్లో కోటీ 3లక్షల 35వేల 290 మందికి వ్యాక్సినేషన్ కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 62,29,89,134 డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.