మీడియా ఊడిగం

ఏ మీడియా చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం

సమస్త మీడియా తరించిపోతున్నది పాలకుల ఊడిగంతో

నిష్పక్షపాతం, నిస్వార్థం, నిబద్దత, ప్రజల పట్ల అంకిత భావం

అన్ని విస్మరిస్తూ, ప్రకటనల కోసమే అర్రులు చాస్తున్నాయి

అధినేతల అనుగ్రహం కోసమే పాట్లు

ఆగ్రహం రాకుండా పాలకులకు వత్తాసు

లొంగిపోతున్నది మీడియా.. పైకానికో, ప్రకటనలకో

ఎమర్జెన్సీ చీకటి కాలంలో.. కొంత వంగి నడవమంటే

సాగిలపడి.. సాష్టాంగ పడ్డాయి అధిక పత్రికలు నాడు

అలవాటుగా మారిందేమో.. అదే వ్యాపార వస్తువైంది

అధికార మత్తులో జోగుతున్నట్లుంది

విపక్షమో, పాలక పక్షమో, వాటి లక్ష్యాలు వేరే

పడి ఉంటున్నాయి వాటి ప్రాపకం కోసమే

జాతీయమా, రాష్ట్రీయమా, అతీతం కాదు మీడియా

స్వంత లాభాపేక్షయే సారాంశమవుతోంది

యాజమాన్యానికే పత్రికా స్వేచ్ఛ.. అమ్ముడు పోతున్నది కలం,

ఏ పత్రిక, ఏ ఛానల్… ఏ పార్టీ, ఏ నేతను

ఎందుకు సమర్థిస్తున్నాయో, రహస్యమేమి కాదు

ఏ పరమార్థం ఆశిస్తూ, ఎలా సమర్థిస్తున్నాయో

వింటున్నా, కంటున్నా అందరికీ అవగతమే

ఏవో కొన్ని ఇంకా మనుగడ సాధిస్తున్నాయి

సంపాదకులతో సంపాధన ఏముందని

యాడ్ మేనేజర్లకు లభిస్తున్నది అగ్రతాంబూలం

కథనాలకు లేవు టార్గెట్స్, ఆదాయాల కోసమే వత్తిడిలు

వృత్తి నైపుణ్యం అక్కరలేదు, స్వంత బుర్రతో పనిలేదు

సాధించాలి లక్ష్యాలు, లేదంటే ఉండదు అక్రిడియేషన్

కుటుంబ పోషణకు దిగజారుతున్నారు కొందరు

మరో మంచి వ్యాపారంగా మారింది యజమానులకు

జనం ఘోషకు గొంతకయ్యే ద్యాస లేదు నేడు

మారాలి మీడియా, మనసు ఆరాటం అదే

మహా కవి శ్రీశ్రీకి క్షమాపణలతో…

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు

Gmail: rangaiahkoneti@gmail.com


త‌ప్ప‌క చ‌ద‌వండి:   

అప్పులు+అమ్మకాలు =పరిపాలన

తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ

నిరీక్షణ

శ్రావణ లక్ష్మికి స్వాగతం

కంప్యూటర్ కాపురాలు

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
Leave A Reply

Your email address will not be published.