నిజమే..! ఒకే ఈతలో రెండు లేగదూడలు

కొత్తూరు (CLiC2NEWS) : ఆశ్చర్యం.. ఒకే ఈతలో రెండు లేగదూడలు.. ఇది నిజమే.. మామూలుగా ఆవులు, గెదేలు ఒకసారి ఒక లేగ దూడకు మాత్రమే జన్మనిస్తాయి. కానీ ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చిన ఘటన కొత్తూరు తండాలో చోటు చేసుకుంది.
కొత్తూరు తండాకు చెందిన నాయక్ అనే రైతుకు కొన్ని ఆవులు ఉన్నాయి. వాటిలో ఒక ఆవు శనివారం ఏకంగా రెండు లేగ దూడలకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆనోటా ఈ నోటా తండావాసులే కాకుండా కొత్తూరు మున్సిపాలిటీ వాసులకు తెలిసింది. దాంతో పలు గ్రామాల నుంచి రైతులు, ప్రజలు ఆ రెండు లేగదూడలను చూడటానికి వస్తున్నారు.
ఇలా ఒకే కాన్పులో ఆవు రెండు లేగదూడలకు జన్మనివ్వడంపై ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాగా రెండు లేగ దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని ఆయన తెలిపాడు.