ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

చౌటుప్పల్ (యాదాద్రి భువనగిరి) (CLiC2NEWS): పాఠశాలలు పునః ప్రారంభ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను డీఈవో చైతన్య జైని సస్పెన్షన్ వేటు వేశారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆర్ కవిత, భువనగిరి మండలం నాగినేనిపల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం వెంకట్రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
వచ్చే నెల 1 నుంచి పుఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా స్పెషల్ ఆఫీసర్లు విజిట్ చేసిన సందర్భంలో పాఠశాలలు మూసివేసి ఉండడమే కాకుండా, విధులకు గైర్హాజరుకావడంతో ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు.
అలాగే డీఈఓ కార్యాలయంలో డీఎల్ ఎంపీగా పని చేస్తున్న ఎల్లయ్యపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందున డీఈఓ చర్యలు తీసుకున్నారు.