వేములవాడకు పోటెత్తిన భక్తులు

వేములవాడ (CLiC2NEWS): తెలంగాణ‌లోని వేములవాడ రాజన్న ఆలయానికి ఇవాళ భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారీగా బారులు తీరడంతో రాజ‌న్న దర్శనానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. శ్ర‌వాణ సోమ‌వారం సందర్భంగా భక్తులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.