పారాలింపిక్స్‌లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం..

సుమిత్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌

టోక్యో (CLiC2NEWS): పారాలింపిక్స్‌లో సోమ‌వారం భార‌త్‌కు మ‌రోస్వ‌ర్ణం ద‌క్కింది. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త్‌కు ప‌త‌కాల పంట పండుతున్న‌ది. ఇప్ప‌టికే షూటింగ్ 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవ‌ని లెఖారా స్వ‌ర్ణం సాధించ‌గా.. ఇప్పుడు జావెలిన్ త్రోయ‌ర్ సుమిత్ అంటిల్ మ‌రో స్వ‌ర్ణాన్ని భార‌త్ ఖాతాలో వేసాడు.

సుమిత్ అంటిల్ అత్య‌ధికంగా 68.55 మీట‌ర్ల దూరం త‌న ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. త‌న ఐదో అటెంప్ట్‌లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు.

మ‌రో వైపు ఆస్ట్రేలియాకు చెందిన మైఖ‌ల్ బురియ‌న్ 66.29 మీట‌ర్ల‌తో ర‌జ‌తం సాధించ‌గా, శ్రీ‌లంక అథ్లెట్ దులాన్ కొడితువ‌క్కు 65.61 మీట‌ర్ల‌తో కాంస్యం కైవ‌సం చేసుకున్నాడు.

కాగా సుమిత్ అంటిల్ సాధించిన గోల్డ్ మెడ‌ల్‌తో క‌లిపి పారాలింపిక్స్‌లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు రెండు బంగారు ప‌త‌కాలు సాధించిన‌ట్ల‌య్యింది. మొత్తం ప‌త‌కాల సంఖ్య ఏడుకు చేరింది.

Leave A Reply

Your email address will not be published.