TS: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్, పంచాయతీ రాజ్ కమిషనర్‌గా శరత్, పరిశ్రమల సంచాలకులుగా కృష్ణభాస్కర్, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా రఘునందన్‌రావు, యువజన సర్వీసుల సంచాలకులుగా వెంకటేశ్వరల్లు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అబ్దుల్ అజీం నియమితులయ్యారు.
అలాగే ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. బదిలీలు జరిగిన ఐఏఎస్ అధికారుల జాబితా ఇలా..
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ : నిఖిల
- వరంగల్ జిల్లా కలెక్టర్: బీ గోపి
- రాజన్న సిరిసిల్ల కలెక్టర్: అనురాగ్ జయంతి
- నాగర్ కర్నూల్ కలెక్టర్: పీ ఉదయ్ కుమార్
- జోగులాంబ గద్వాల్ కలెక్టర్: వల్లూరు క్రాంతి
- కామారెడ్డి కలెక్టర్: జితేశ్ వీ పాటిల్
- మహబూబాబాద్ కలెక్టర్: కే శశాంక
- జనగామ కలెక్టర్: జీహెచ్ శివలింగయ్య
- టీఎస్ పీఎస్సీ కార్యదర్శి: అనితా రామచంద్రన్
- వ్యవసాయశాఖ కార్యదర్శి: రఘునందన్
- యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్: వీ వెంకటేశ్వర్లు
- పంచాయతీరాజ్ శాఖ కమిషనర్: శరత్
- పరిశ్రమల శాఖ సంచాలకులు: క్రుష్ణ భాస్కర్
- మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి: అబ్దుల్ అజీం