హైద‌రాబాద్‌లో భారీ వర్షం.. జ‌ల‌మ‌య‌మైన రహదారులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్​ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. న‌గ‌రంలోని ఖైర‌తాబాద్‌, పంజాగుట్ట‌, అమీర్‌పేట‌, ఎస్ ఆర్ న‌గ‌ర్‌, జూబ్లీహిల్స్‌, ల‌క్డీకాపూల్‌, నాంప‌ల్లి, యూసుఫ్‌గూడ‌, శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ, కూక‌ట్‌ప‌ల్లి, నిజాంపేట‌, కోఠి, సుల్తాన్ బ‌జార్‌, బేగం బ‌జార్‌, అబిడ్స్‌, నాంప‌ల్లి, బ‌షీర్‌బాగ్‌, లిబ‌ర్టీ, హిమాయ‌త్ న‌గ‌ర్‌, నారాయ‌ణ‌గూడ‌, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసిన జోరు వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఒక్కసారిగా కురిసిన జోరు వానతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్​ అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట వద్ద వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.