TS: రాగల మూడు రోజులు భారీ వర్షాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు రోజుల లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు, శనివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో 3- 4 రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఈ నెలం 6వ తేదీన బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని పేర్కొంది. ఆ త‌రువాత అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు, శనివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా ఎడతెరిపి లేకుండా కురిసిన జోరువానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 7గంటల నుంచి చిరుజల్లులుగా మొదలై 15నిమిషాల్లోనే దాదాపు 3.5సెంటీమీటర్ల వాన నగరవ్యాప్తంగా కురిసింది.

అర‌గంట‌లోనే మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా బాలాన‌గ‌ర్‌లో 7 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. నగ‌రంలోని మిగ‌తా ప్రాంతాల్లో 5 నుంచి 4 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.

 

Leave A Reply

Your email address will not be published.