ప్ర‌ధాని మోడీతో సిఎం కెసిఆర్ భేటీ

10 అంశాల‌పై ప్ర‌ధానికి లేఖ‌లు అంద‌జేసిన ముఖ్య‌మంత్రి

న్యూఢిల్లీ  (CLiC2NEWS): ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ సిఎం కెసిఆర్ ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. శుక్ర‌వారం ప్ర‌ధానితో దాదాపు దాదాపు 50 నిమిషాల పాటు స‌మావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 10 అంశాల‌ను కేసీఆర్ మోడీ దృష్టికి తీసుకెళ్లారు.

సిఎంఒ అధికారులు తెలిపిన వివార‌ల మేర‌కు..

ఐపీఎస్ క్యాడర్ రివ్యూ, రాష్ట్రంలో టెక్సటైల్ పార్క్ ఏర్పాటు, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధానిని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.

మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని క‌రీంన‌గ‌ర్‌లో ట్రిపుల్ ఐటీ, హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల‌ని సిఎం ప్ర‌ధానిని కోరారు. చేనేత రంగాన్ని ప్రోత్స‌హించేందుకు జౌళిపార్కు ఏర్పాటు చేయాల‌ని కోరారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాల‌ని కొత్త జిల్లాల్లో న‌వోద‌య విద్యాల‌యాలు మంజూరు చేయాల‌ని, అలాగే తెలంగాణ‌లో గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ మోడీని కోరారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంబంధించిన లేఖ‌ల‌ను మోడీకి కేసీఆర్ అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.