SIIMA 2019: ఉత్తమ చిత్రం ‘జెర్సీ’.. ఉత్తమ నటుడు మహేశ్‌బాబు

హైదరాబాద్ (CLiC2NEWS): దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇప్పటికే కన్నడం, మలయాళం, తమిళం భాషల్లోని కొన్ని విభాగాలకు అవార్డులు అందించగా.. తాజాగా సైమా-2019కి గానూ తెలుగు అవార్డులు ప్రకటించారు.
టాలీవుడ్‌కు సంబంధించి సైమా 2019 అవార్డులు గెలుచుకున్న వారు..
- ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
- ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
- ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మిక మందన్న (డియర్ కామ్రేడ్)
- ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
- ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
- ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
- ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
- ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్షి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
- ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
- ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
- ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
- ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
- ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
- ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)