తెలంగాణ‌లో వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

నాగ‌ర్‌క‌ర్నూల్ / న‌ల్ల‌గొండ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి చెందారు. న‌ల్ల‌గొండ జిల్లా క‌ట్టంగూరు స‌మీపంలో జ‌రిగిన రెండు వేర్వేరు ప్ర‌మాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌ద‌ర మండ‌ల ప‌రిధిలో జిరిగిన రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించారు.

న‌ల్ల‌గొండ: జిల్లాలోని కట్టంగూరు సమీపంలో జరిగిన‌ రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముత్యాలమ్మగూడెం వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కంటైన‌ర్‌ను ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిన ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఘటనలో ఆగిఉన్న లారీని కారు ఢీన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

నాగ‌ర్‌క‌ర్నూల్: జిల్లాలోని ప‌ద‌ర మండ‌లం మ‌ద్దిమ‌డుగు స‌మీపంలో ఆర్టీసీ బ‌స్సు – ఆటో ఢీకొన్న ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు స‌హా ముగ్గురు మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల‌ను మిర్యాల‌గూడ స‌మీపంలోని సూర్య‌తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మ‌ద్దిమ‌డుగు ఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.