రాగల 3 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్ష సూచన

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలు మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, జగిత్యాల, హైదరాబాద్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉదయం 8.30గంటల వరకు మెదక్ జిల్లా పాపన్నపేటలో అత్యధికంగా 87.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.