షేక్.బహర్ అలీ: మెదడు చురుగ్గా ఉండాలంటే..

మానవుని మెదడుకి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. అది ఒక అద్భుతం.. అమోగం.. ఏ పని చేయాలన్నా మెదడు సరిగ్గా పని చేస్తేనే అన్ని పనులు మనం సక్రమంగా చేసుకుంటాము. అదే సక్రమంగా లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము.

మెదడు గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. మెద‌డు లేనిది మానవుని మనుగడే లేదు. మెదడు యొక్క ఆజ్ఞ లేనిది శరీరంలో ఏ అవయమము కూడా కదలదు.. పనిచేయదు. ఎవరైనా మనకు వెంటబడి కొట్టడానికి వస్తే మెదడు వెంటనే స్పందించి అతనిని నుండి తప్పించుకుంటాం. అదే విధంగా కుక్క మన వెంటబడింది అనుకోండి.. అది మెదడు పసిగడితేనే మనం వెంటనే తప్పించుకోవటాని 100 స్పీడ్ తో పరుగు పెట్టి కుక్క నుండి తప్పించుకుంటాం. అదే మెదడు పై విషయాలలో పసి గట్టకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది.

ఎవరైనా స్వీట్ కానీ, వేడి వేడి బజ్జిలు కానీ తింటుంటే మనకు కూడా తినాలి అని కోరిక పుట్టించిదే మెదడు. ఎవరైనా చిన్న పిల్లలు ముద్దుగా ఉంటే ముద్దు పెట్టాలనిపించేదే కూడా మెదడే, చిన్న పిల్లలు ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయేది, పరుగులు తీసే జలపాతం చూసి పరవశించిపోయేది అంతా మన మెదడు మహిమే.

మనం చక్కని పాటలు పాడుతాం. చక్కగా మాట్లాడుతాం. ఏదైనా బహుమతులు వచ్చినా మురిసిపోతాం.. ఇదంత మెదడు చలువే.

మనం పని చేయటానికి కాళ్ళు చేతుల్లో బలం ఉందని, కండలు ఉన్నాయని అనుకుంటాము. కానీ ఇవన్నీ మెదడు స్పందించటం వలన వచ్చినవే.

శరీరంలో ప్రతి అవయవాలు, అంగాలు, ప్రత్యంగాలు.. ఏ భాగమైన కదులుతూ పనిచేస్తుంది అంటే అంగాల మధ్య సమన్వయము ఉందంటే మెదడు కారణం.

శరీరానికి ఎవరైనా తాకిన, గిల్లిన, గిచ్చినా, చీమ కుట్టిన, చాటుకున్న చేయి పట్టి లాగేసుకుంటారు. ఎండలో పోయినపుడు వేడి తగిలినపుడు బాధపడేది.. చ‌ల్ల‌గాలి  తాకితే చాలు ఎంతో హాయిగా ఉందని పరవశించిపోతారు. ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అంటారు. నొప్పి, వేడి, చల్లద‌నం అంతా మెదడు చలువే.

మానవుని శరీర నిర్మాణంలో మెదడు చాలా ముఖ్యమైన అవయం. మానవుని అనుభూతులు అన్నింటికీ కేంద్రం మెదడు. మానవుని చేతనాచేతన స్థితిగతులకు మూలం, ఆలోచనలకు, ఆవేదనలకు, అవేశాలకు, జ్ఞాపకాలకి, జ్ఞాన నీదికి, భ్రమలకు, బ్రాంతులకు, కోపాలకి, తాపాలకి, అన్నిటికి మూలం మెదడు. మెదడు సరిగ్గా పనిచేయకపోతే శ్వాస నడవదు. గుండె కొట్టుకోదు, ప్రాణి మనుగడే లేదు. మెదడు అజ్ఞ లేనిది కండరాలు కదలవు, ఆడుకోలేము, పాడుకోలేము, పడుకోలేము.


అందుకే మెదడు సరిగ్గా పనిచేయకపోతే చాలా మంది ఏందిరా భాయ్ మెదడు మోకాళ్ళలో వుందా అంటారు. ఈ విషయం మనం చాలా చోట్ల విని ఉంటాము. అవసరమైతే మనకు కూడా ఎవరో ఒకరు ఎదో ఒక సమయంలో అని కూడా వుంటారు. కానీ ఈ విషయం అందరికి చెప్పలేము కదా.

  • మెదడు చక్కగా పనిచేయటానికి, జ్ఞాపక శక్తికి, దీనికి కావాల్సిన ఆహారం చక్కగా అందిస్తే మన మెదడు బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటాము.
  • మస్తీష్కమ్ ఆరోగ్యంగా ఉండటానికి కావల్సిన విటమిన్లు, విటమిన్ B1 మొలకేత్తి గింజలు, తాజా కూరగాయలు, వేరుశెనగ పప్పు, లో దొరుకుతుంది.
  • విటమిన్ B 2, పాలు, పానీర్, టమాటా, నేరేడు పండ్లు.
  • విటమిన్ B 6,దంపుడు బియ్యం, ఇస్టు, డ్రై ఫ్రూట్స్‌, బంగాళాదుంపలు, పండ్లు, తాజా కూరలు.
  • విటమిన్ B12,పాలు, పెరుగు, పానీర్.
  • విటమిన్ C పాలు, బత్తాయి ఊసిరి, నిమ్మ, ఆకుకూరలు, ఎర్రముల్లంగి, క్యాబేజి, స్ట్రాబెర్రీ,
  • విటమిన్ A: టమాటాలు, డ్రై ఫ్రూప్ట్స్, పప్పులు, బియ్యం, పాలకూర, తాజాకూరలు,
  • ఖనిజ లవణాలు కూడా మెదడుకి శక్తినిస్తాయి. కాల్షియమ్, మస్తీష్కాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది. పప్పు, బియ్యం, పండ్లు, చెట్టున పండిన పండ్లలో ఉంటుంది.
  • జింక్ మస్తిష్కాన్ని సంతులితంగా ఉంచుతుంది ఇది బఠాణి గింజలు, పప్పులు, బియ్యం, వీటిలో ఉంటుంది.
  • ఐరన్, పోటాషియం, సోడియం ఇవన్ని మెదడుకు చాలా అవసరం.

మెదడు చక్కగా పని చేయాలంటే చక్కగా ఆహారం తీసుకోవాలి, సరైన సమయంలో నిద్ర పోవాలి, శరీరానికి చక్కగా వ్యాయామం ఉండాలి. చక్కని ఆలోచనలు చేయాలి. సామజిక కార్యక్రమాలు చేస్తుంటే చెడు ఆలోచ‌న‌లు రాకుండా నిరోదిస్తూ.. రోగనిరోధక శక్తి మెదడుకు పెరిగి వంద యేండ్లు చిరంజీవిలాగా వర్దిల్లుతూ ఆరోగ్యంగా బ్రతుకుతాం.

-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Comments are closed.