కాళేశ్వరం బ్యాక్ వాట‌ర్ పంట ముంపు రైతుల‌ను ఢిల్లీ తీసుకెళ్తా: వివేక్

మంథ‌ని (CLiC2NEWS) : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో రైతులు నష్టపోతున్నారన్నారు మాజీఎంపీ వివేక్ వెంకటస్వామి.  అన్నారం బ్యాక్ వాట‌ర్ ముంపు బాధితులు బిజెపి ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా, రాస్తారోకో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపి వివేక్ వెంక‌ట‌స్వామి మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ వైఫల్యంతోనే పొలాలు మునుగుతున్నాయన్నాయ‌ని వివేక్ ఆరోపించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు రీ డిజైన్ చేయడం వల్లే ఈ దుస్థితి వివేక్ దుయ్య‌బ‌ట్టారు.  అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్‌తో కొందరి పొలాలు మునిగాయి. బాధిత రైతులంతా 3రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపారు వివేక్ వెంకటస్వామి. ముంపు బాధితుల‌కు ఎకరాకు 30 లక్షల పరిహారం ఇచ్చి బాధిత రైతుల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాధిత రైతులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు సమస్య వివరిస్తానని వివేక్ తెలిపారు.

1 Comment
  1. Helpful information. Fortunate me I discovered your web site by
    chance, and I am surprised why this coincidence did
    not came about earlier! I bookmarked it.

    Also visit my page – gatwick-airport-massage.mystrikingly.com

Leave A Reply

Your email address will not be published.