పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

మంథని (CLiC2NEWS): మంథని మండలం సిరిపురం గ్రామానికి చెందిన రైతులు నీటమునిగిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని శుక్రవారం ఆర్డీవో, తాహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం, ఎస్ఎఫ్ఐ నాయకుల మద్దతుతో రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు సిపిఎం, ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ప్రాజెక్టు ఆనుకొని ఉన్న పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయని అన్నారు. సిరిపురం గ్రామానికి చెందిన రైతుల భూములు దాదాపు 150 ఎకరాలు నీట మునిగాయని అన్నారు కాలేశ్వరం బ్యాక్ వాటర్ తో పొట్టచేతికి వచ్చిన పంట పొలాలు పూర్తిగా నాశనం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి అన్నదాతలను ఆదుకోంవలని కోరారు. ఈ సంవత్సరం వేసిన పంటపొలాలను క్రాఫ్ హాలిడే గా ప్రకటించి ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రాజెక్ట్ ఆనుకొని ఉన్న భూములను ప్రభుత్వం సర్వే చేసి భూముల స్వాధీనం చేసుకొని నష్ట పరిహారం చెల్లించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా అనంతరం రైతు ఈసంపెల్లి నారాయణ మాట్లాడుతూ.. మేము 4 ఎకారాల భూమి సొంతభూమి 4 ఎకరాల కౌలుభూమిలో సాగుచేస్తున్నాను. ఇప్పటికి మూడు సార్లు వర్షం వచ్చి గోదావిరి బ్యాక్ వాటర్ తోని 3 సార్లు మునిగి పోయిందని వాపోయాడు. దీనికి పరిక్షారం ప్రభుత్వమే చూపించాలని క్రాప్ హాలిడే ప్రకటించాలని కోరుతున్నాం అని రైతు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్య సందీప్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎరుకల సాగర్ ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ భోగేరోహి బాపు సమ్మయ్య రాజేశం రవి లింగయ్య మధునయ్య తదితరులు పాల్గొన్నారు