TSRTC: దసరాకు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల‌లో ద‌స‌రా అంటే పెద్ద పండ‌గ‌.. ఈ పండుగ సంద‌ర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాగా ఈ ప్రత్యేక బస్సులకు గానూ..టీఎస్‌ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్ర‌త్యేక బ‌స్సుల‌ను తెలంగాణ, ఎపిల‌కే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. దీని కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ప్రత్యేక బస్సులలో టికెట్‌ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండగకు మొత్తం.. 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్‌ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. అలాగే రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల,నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.