న‌న్ను నెట్టివేస్తూ దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు : ప్రియాంక!

ల‌క్నో (CLiC2NEWS): ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన రైతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన త‌న ప‌ట్ల‌ యూపీ పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త‌న‌ను అడ్డ‌గించిన పోలీసులు త‌న‌ను నెట్టివేస్తూ దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప్రియాంక  మండిప‌డ్డారు.

నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఆయా రైతు సంఘాలు నేడు దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ల‌ఖ్‌న‌పూ నుంచి ల‌ఖింపూర్ ఖేరి మార్గంలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మ‌రోవ‌పైపు బాధిత కుటుంబాల‌ను ప‌రామార్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధృ వాద్రాను సీతాపూర్ పోలీసులు మార్గ‌మ‌ద్యంలో అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై ప్రియాంక మాట్లాడుతూ.. త‌న అరెస్ట్‌కు అవ‌స‌ర‌మైన ప‌త్రాలు చూప‌కుండా అక్ర‌మంగా నిర్బంధించార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇత‌ర నేత‌ల‌ను అడ్డుకుని అక్ర‌మ నిర్బంధాల‌కు పాల్ప‌డ‌టాన్ని రాజ‌స్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఖండించారు. విప‌క్ష నేత‌ల నిర్బంధం ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని అన్నారు. ప్రియాంక‌తో పాటు చ‌త్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్‌, పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రాంధ్వా త‌దిత‌రుల‌ను యోగి సర్కార్ అడ్డ‌గించింద‌ని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.