రేపటి నుంచి దసరా సెలవులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు 4 రోజులు సెలవులు ఉంటాయి. ఇంటర్ కాలేజీలు తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.