శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఎలా తగ్గించుకోవాలి..
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/kidnye.jpg)
శరీరంలో యూరిక్ యాసిడ్ యూరిన్ బ్రేక్ డౌన్ వలన తయారు అవుతుంది. సాధారణంగా మనం తీసుకున్న ఆహారం శరీరంలో చేరిన తరువాత అనేక రూపంతరాలు (మెటబాలిజం )చెందుతుంది. దాని ఫలితంగా శరీరంలోని అనేక రసాయనక పదార్దాలు విలువడుతాయి. ఇలా రూపాంతరం చెందిన రసాయనికాల వలన శక్తి ఉద్భవిస్తుంది. శరీరం ఆరోగ్యంగా తయారు అవుతుంది. మరొక పక్క మెటబొలిజం వలన వ్యర్థం పదార్దాలు, విషపదార్ధాలు, అనేకం తయారు అవుతాయి. ఆ వ్యర్థ పదార్దాలు… విష పదార్ధాల పనిపట్టించేది కిడ్నీ.. వాటిని బయటకు తోసేసి మనల్ని రక్షిస్తుంది.
తిన్న ఆహారం అన్నం, దుంపలు, కొవ్వు పదార్దాలు, పప్పులు, పండ్లు, పదార్దాల నుండి నీరు, కార్బన్ dioxideలు ఏర్పడుతాయి. పప్పులు, మాంసం నుండి అమ్మోనియం విలువడుతుంది. ఈ అమ్మోనియం వెంటనే కాలేయం చేరి యూరియాగా మారుతుంది. ఈ రకంగా మెటబొలిజం లో ఆక్సికరణ చర్యగా శరీరంలో తయారయ్యే విష పదార్థాలు, వ్యర్థం పదార్ధాలు, యూరియా, యూరిక్ యాసిడ్, carbon dioxide, శరీరంలో ఉండిపోతే ఎంతో ప్రమాదం జరుగుతుంది. శరీరంలో వివిధ దాతువుల నుండి రక్తం విష పదార్ధాలను సేకరిస్తూ కిడ్నీ దగ్గరకు చేరగానే రక్తంలో వున్న విషపదార్ధాలను, వ్యర్థ పదార్ధాలను జాగ్రత్తగా ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది.
ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారికి మాత్రం యూరిక్ ఆసిడ్ తయారు అవుతుంది. ఇది నీరు ఎక్కువగా తాగితే మూత్రం ద్వారా బయటకు పోతుంది. యూరిక్ యాసిడ్ పెరగటం వలన కిడ్నీ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుంది.లేదా కిడ్నీ లు దెబ్బ తినటం జరుగుతుంది. తరువాత శరీరంలో హానికరం పెరిగి ఇతర బాగాల మీద కూడా చెడు ప్రభావం చూపుతుంది. జాయింట్స్ పెయిన్ రావటం.. మోకాళ్ళలో నొప్పులు రావటం, మోచేతులు జాయింట్స్ లో నొప్పులు రావటం, జరుగుతుంది. దీనికి నాకు తెలిసిన గోల్డెన్ హెల్త్ టిప్ ని ఈ క్రింది విధంగా చేస్తే చాలు యూరిక్ యాసిడ్ తగ్గుతుంది..
తులసి ఆకులు మరియు మిరియాలు, దేశీయ నెయ్యితో చేసుకునే విధానం. తులసి ఆకులలో చక్కని ఆయుర్వేద ఔషద గుణాలు పుష్కలంగా వున్నాయి. విటమిన్ A, D, ఐరన్, ఫైబర్, ఏంటి ఆక్సిడెంట్ వున్నాయి. ఇవి చాలా చక్కగా యూరిక్ యాసిడ్ ని తగ్గిస్తాయి.
తులసి ఆకులు -6
మిరియాలు -4
వీటిని మెత్తగా దంచి తగినంత దేశీయ నెయ్యి కలిపి గోళీలాగా చేసుకొని పరిగడుపున ప్రతిరోజు యూరిక్ ఆసిడ్ తగ్గేంత వరకు తీసుకోవాలి.
Natural గా అయితే ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, రెండు టీ స్పూన్ తేనే కలిపి తాగితే కొన్ని రోజులలో యూరిక్ యాసిడ్ తగ్గి అన్ని నొప్పులు పోతాయి. కిడ్నీ మీద ప్రభావంపడదు.
-షేక్.బహర్ అలీ
-ఆయుర్వేద వైద్యుడు