AR Rahman స్వ‌ర‌ప‌రిచిన `అల్లిపూల వెన్నెల` బ‌తుక‌మ్మ పాట వ‌చ్చేసింది

హైదరాబాద్ (CLiC2NEWS): ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించగా.. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ‘అల్లిపూల వెన్నెల’ బతుకమ్మ పాట వచ్చేసింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పాటను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన పాటను ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యం అందించారు. జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ ఘనంగా జరగనుంది. ఈ పాటను విడుదల చేసిన సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ట్వీట్‌ చేస్తూ.. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రెహ‌మాన్ ట్వీట్‌ను ఎమ్మెల్సీ కవిత రీట్వీట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.