భీమ్లా నాయక్‌లో నిత్యా మీనన్ ఎలా ఉందో చూశారా!

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ నుంచి‘అంతా ఇష్టం’అనే పాట అక్టోబర్‌ 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ తెలియజేస్తూ..పవన్‌ కల్యాణ్‌, నిత్యామీనన్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

ఈ మేర‌కు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఒక గుడిసె ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నిత్యా మీన‌న్ కూర్చొని ఉన్న ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ భీమ్లా నాయ‌క్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర . మాట‌లు, స్క్రీన్‌ప్లే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.

Leave A Reply

Your email address will not be published.