న‌ల్ల‌గొండ లో ప‌ర్య‌టించిన గ‌ర‌వ్న‌ర్‌

నల్లగొండ (): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్నారు. నల్గొండలోని ఓ ప్రైవేట్‌ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ ఇక్కడికి వచ్చారు. ఆ కార్య‌క్ర‌మం అనంత‌రం గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన సెమినార్ హాల్ ను ప్రారంభించారు. త‌రువాత పానగల్‌లోని చారిత్రక ఛాయా సోమేశ్వరాలయం సందర్శించి ఆలయంలో శివ లింగం పై నీడ ( ఛాయ) పడే అద్భుతాన్ని వీక్షించారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా మహాత్మాగాంధీ వర్సిటీలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.