దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ (CLiC2NEWS): దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్-నర్సాపూర్ (07456) రైలు ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపారు.
నర్సాపూర్-సికింద్రాబాద్ (07455) రైలు ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందన్నారు.
ఇక సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07053) రైలు ఈ నెల 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుతుందని, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07054) ఈ నెల 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.