Bombay High Court: యాసిడ్ దాడి బాధితురాలికి రూ.10 లక్షలు ఇవ్వండి..
మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి (CLiC2NEWS): నగరానికి చెందిన యాసిడ్ దాడి బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఓ మహిళ 2010వ సంవత్సరంలో భర్త చేతిలో దాడికి గురైంది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబులిటీస్ చట్టం ప్రకారం, యాసిడ్ దాడి బాధితులు పరిహారానికి, పునరావాసానికి అర్హులని న్యాయస్థనం పేర్కొంది. అంతే కాకుండా పరిహారంతో పాటు బాధితురాలి ముఖం మునుపటిలా మారేందుకు అవసరమయ్యే శస్త్రచికిత్స ఖర్చులు కూడా భరించాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మాధవ్ జమదార్‌ల ధర్మాసనం పేర్కొంది.