జోగులాంబ జిల్లాలో గోడ కూలి ఐదుగురు మృతి

గద్వాల (CLiC2NEWS): జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని కొత్తపల్లిలో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున గోడ కూలీ ఐదుగురు మృతిచెందారు. గ్రామానికి చెందిన మోష శనివారం రాత్రి తన భార్య, ఐదుగురు పిల్లలతో ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గుడిసె గోడ కూలింది. దీంతో భార్యాభర్తలతోపాటు ముగ్గురు పిల్లలు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతిచెందినవారిలో మోష, మోష భార్య శాంతమ్మ, కుమారులు చరణ్, తేజ, రాము ఉన్నారని, స్నేహ, చిన్ని గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. కాగా ఒకే కుటుంబానికి ఐదుగురు వ్యక్తులు మరణించడంతో కొత్తపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.