AP: కొత్తగా 517 కొవిడ్ కేసులు
ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి (CLiC2NEWS): ఆంద్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 38,786 మందికి పరీక్షలు నిర్వహించగా
తాజాగా 517మందికి పాసిటివ్గా నిర్ధారణ అయింది. ఇక ఈరోజు 8మంది కరోనా మ హమ్మారికి బలైనారు. 825 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 యాక్టవ్ కేసులున్నాయి అని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఎపిలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. దాంతోపాటు సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం రేపటి నుంచి అమలులోకి రానుంది.