భద్రాచలం: మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు

భద్రాచలం (CLiC2NEWS): భద్రాచలం శ్రీ‌రాముని సన్నిధిలో ద‌స‌రా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ న‌వ రాత్రుల‌లో తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహిస్తారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగనున్నాయి. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. శుక్రవారం నిజరూప అలంకారంలో అమ్మవారు భ‌క్తుల‌కు దర్శనమివ్వనున్నారు. శుక్ర‌వారం సాయంత్రం దసరా మండపంలో శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.