సాగర్ 2 గేట్లు ఎత్తి నీటి విడుదల

నాగార్జునసాగర్ (CLiC2NEWS): నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొసాగుతోంది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 65,579 క్యూసెక్కులు. ఈ క్రమంలో ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి 16,138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు
- ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులు
- గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు
- ప్రస్తుత నీటినిల్వ 311.14 టీఎంసీలు.