శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి రేపటినుండి భక్తులకు అనుమతి

తిరువనంతపురం (CLiC2NEWS) : శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తులామాస పూజల కోసం శనివారం సాయంత్రం నుండి తెరవనున్నారు. ఆదివారం నుండి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టిడిబి) ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న అయ్యప్ప భక్తులకు రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఆలయంలోకి అనుమతించనున్నారు. భక్తులు వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం లేదా ఆర్టీపీసీ ఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పని సరిగా తమవెంట తీసుకురావాలని దేవస్థానం తెలిపింది.
తులామాస పూజల కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయం అక్టోబరు 21న మూసివేస్తారు. మళ్ళీ నవంబర్ 2వ తేదీన అత్తచితిర పూజ కోసం గుడిని తెరువనున్నారు.