Raipur: రైల్వేస్టేషన్లో పేలుడు..
జవాన్లకు గాయాలు

రాయ్పూర్ (CLiC2NEWS) : ఛత్తీస్గడ్ రాజధాని రాయ్పూర్ రైల్వేస్టేషన్లో మందుగుండు సామాగ్రితో కూడిన కంటైనర్ను రైలులోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో నలుగురు సిఆర్పిఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు అక్కడే ఆగి ఉండడంతో జవాన్లు గాయపడ్డారు. డిటోనేటర్లు, హెచ్డి కాట్రిడ్జ్ వంటి మందుగుండు సామాగ్రి ఉన్న కంటైనర్ ప్రమాదవశాత్తూ కిందపడి ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చికిత్స కోసం అస్సత్రికి తరలించి చికిత్స అందించారు.