రాగల 3 రోజులు తెలంగాణకు వర్ష సూచన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రానున్న 3 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర తెలంగాణ పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 2 రోజులు వర్షాలు అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ (ఆదివారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.