India Corona: కొత్తగా 13,596 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,40,81,315కు చేరాయి.
- ప్రస్తుతం దేశంలో 1,89,694 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- గత 24 గంటల్లో కొత్తగా 19,582 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,34,39,331 మంది కోలుకున్నారు.
- గత 24 గంటల్లో మరో 166 మంది మరణించారు.
- అలాగే కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 4,52,290 మంది మరణించారు.
- ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 97.79 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.