టిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

హైదరాబాద్ (CLiC2NEWS): మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ సమక్షంలో మోత్కుపల్లి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈకార్యక్రమంలో సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ.. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు. ప్రజా జీవితంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే ఆకకుండా అణగారిన ప్రజల వాయిస్‌గా ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వెంట ఎంతో అభిమానంతో వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.