ఆ వీడియోకు కెటిఆర్ ఫిదా!

హైద‌రాబాద్ (CLiC2NEWS): మంత్రి కెటిఆర్ సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అనేక అంశాల మీద పోస్టింగ్ లు పెడుతూ ఉంటారు. అలాంటి కెటిఆర్‌నే ఇటీవ‌ల ఓ వీడియో బాగా ఆక‌ర్షించింది. `ఒక దార్శ‌నికుడి సంక‌ల్పం ఈనాటి ప‌ల్లెల ప‌చ్చ‌ని మంద‌హాసం` పేరుతో తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత గ్రామాల్లో వ‌చ్చిన మార్పుల‌ను వివ‌రిస్తూ సీనియ‌ర్‌ పాత్రికేయుడు ఎస్జీవీ శ్రీ‌నివాస‌రావు రూపొందించిన ఆ వీడియోను మంత్రి కెటిఆర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. తొలి తెలంగాణ అసెంబ్లీలో కెసిఆర్ మాట‌ల‌తో ఆ వీడియో ప్రారంభ‌మ‌వుతుంది. కెటిఆర్ స్వ‌యంగా పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ఒక్క‌రోజులోనే 60 వేల హిట్స్ సాధించింది. ఆ వీడియో మీ కోసం…

Leave A Reply

Your email address will not be published.